ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
పిచ్చాటూరు, జూన్ 2 గరుడధాత్రి : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పిచ్చాటూరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు పొగాకు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ర్యాలీలో పాల్గొన్న వారు "మత్తు పదార్థాలు వద్దు – ఆరోగ్యం ముద్దు", "మందు, సిగరెట్ వద్దు – పౌష్టికాహారం ముద్దు", "చుట్ట, బీడీ, సిగరెట్ ప్రాణానికి పెనుముప్పు", "పొగ త్రాగవద్దు –...