ప్రభుత్వ పాఠశాలలకు శ్రీసిటీ చేయూత
- రూ.43 లక్షలతో విద్యా వసతుల కల్పన - పరిశ్రమల ప్రతినిధులచే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గరుడధాత్రి : శ్రీసిటీ ఫౌండేషన్ సమన్వయంతో శ్రీసిటీలోని చార్ట్ వీఆర్వీ, పార్క్సన్ ప్యాకేజింగ్, బెర్జిన్ పైప్స్ పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కార్యక్రమాల కింద సుమారు రూ.43 లక్షల వ్యయంతో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయా సంస్థల ప్రతినిధులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా, పారిశుధ్య, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి....