గరుడధాత్రి న్యూస్ :
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం వల్ల వారు బోధించే విద్య శ్రేష్టమైనదిగా ఉంటోందని ఎమ్మెల్యే అభివర్ణించారు.
అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పాఠ్యపుస్తకాలు, ఆట వస్తువులు వంటి అనేక రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
తల్లికి వందనం పేరిట ప్రతి పేద విద్యార్థికి ప్రభుత్వం ఏటా ₹15 వేలు చొప్పున అందించి ఆర్థికంగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.
ఇన్ని అవకాశాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
అనంతరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రం అందించి ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.
తదుపరి బడి పిలుస్తుంది వాహనాన్ని ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించి ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఎంఇఓ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.