ప్రభుత్వ భూములపై రియల్‌ దందా..!

-ప్రభుత్వ భూములకు రెక్కలు..! -సెంటు రూ.4 లక్షల వరకు పలుకుతున్న వైనం -రాళ్లకుప్పంలో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం -అధికారుల మౌనవ్రతంపై గ్రామస్తుల ఆగ్రహం సత్యవేడు నవంబర్ 2 గరుడధాత్రి : పరిశ్రమల రాకతో భూముల విలువ పెరుగుతోంది.. ఇదే అదనుగా ప్రభుత్వ భూములపైనా కొందరి కన్ను పడింది. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ భూములు అక్రమ విక్రయాలకు వేదికవుతున్నాయన్న ఆరోపణలు సత్యవేడు మండలం వానెల్లూరు పంచాయతీ పరిధిలోని రాళ్లకుప్పంలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ శాఖదే కానీ విలువైన భూములను...