ప్రభుత్వ భూములపై రెవెన్యూ మాయాజాలం?
వంకలకూ పట్టాలు.. ప్రభుత్వ భూములపై రెవెన్యూ మాయాజాలం? కురబలకోట మండలంలో భారీ భూ అక్రమాలపై ఆరోపణలు గరుడధాత్రి : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు... నిబంధనలను తుంగలో తొక్కి అక్రమార్కులకు ధారాదత్తం చేస్తున్నారా? అన్న అనుమానాలు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్ భీమేశ్వరరావు హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న భూ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. అంగళ్లు సర్వే నంబర్ 90లో ‘ఎంజాయ్‌మెంట్’ మాయాజాలం అంగళ్లు గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 90...