ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరిన తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి తిరుపతి ఆగస్టు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ దంత వైద్య కళాశాలలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి...