ప్రముఖ శైవక్షేత్రమైన మల్లప్పకొండ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న 8 మందికి జరిమానా
కుప్పం సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్ గుడుపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లప్పకొండ వద్ద కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ, ప్రజలకు ఇబ్బందికరంగా మరియు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గుడుపల్లి ఎస్సై వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముందుగా ఎమ్మార్వో , గుడుపల్లి వద్ద బైండోవర్ చేసి, అనంతరం కేసులు నమోదు చేసి గౌరవ _క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, కుప్పం లో ప్రవేశపెట్టగా, గౌరవ న్యాయమూర్తి గారు 8 మందిని...