ప్రయాణికులు వేచిఉన్నా.. ఆగని ఆర్టీసీ బస్సులు..!

కార్వేటినగరం, అక్టోబర్ 3 గరుడ ధాత్రి న్యూస్ : కార్వేటినగరంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్నప్పటికీ కొన్ని ఆర్టీసీ బస్సులు నిలపకుండా వెళ్లిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నుంచి పల్లిపట్టు వరకు నడిచే ఆర్టీసీ బస్సులు కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ ఆర్చ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, పచ్చికాపలం రోడ్డు ప్రాంతాల్లో సాధారణంగా ఆగుతుంటాయి. అయితే శనివారం మధ్యాహ్నం సుమారు 3.10 గంటల సమయంలో పల్లిపట్టు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న...