ప్రారంభానికి నోచుకోని విలేజ్ హెల్త్ క్లినిక్

-ప్రజారోగ్యంపై అధికారుల నిర్లక్ష్యమా? వరదయ్యపాలెం, జూన్ 12 గరుడధాత్రి : తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం సచివాలయ పరిధిలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం పూర్తై దాదాపు నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే క్లినిక్‌ను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు...