ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
-లెనిన్ సెంటర్‌లో జర్నలిస్టుల ధర్నా - బెదిరింపులు ఆపాలని డిమాండ్ విజయవాడ, మే 28,గరుడధాత్రి న్యూస్ : సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, బెదిరింపుల పర్వం ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు...