బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులపై చిత్తూరు జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా – జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS
గరుడధాత్రి న్యూస్ : రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యాన్ని పరిరక్షించడం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో పోలీస్, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, చట్టబద్ధమైన విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాలు...