బత్తలవారి కండ్రిగ గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

పుత్తూరు మండల పరిధిలోని బత్తలవారి కండ్రిగ (సిటిఆర్ కండ్రిగ) గ్రామంలో జరుగుతున్న గంగమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుండగా, జాతర రెండో రోజు బుధవారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి టెంకాయ హారతులు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే...