బధిరులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతాం – చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్
చిత్తూరు,సెప్టెంబర్,27(గరుడ దాత్రి న్యూస్)బధిరులు ఎదుర్కొంటున్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందిచిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలోజిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బధిరుల దినోత్సవం మరియు సంజ్ఞల భాషా దినోత్సవంపురస్కరించుకొని జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలన్నీ ప్రారంభించారుఈ కార్యక్రమంలోచిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్.విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి. పుల్లారెడ్డి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్...