బాధిత కుటుంబాలకు కలెక్టర్ భరోసా
“మీ వెన్నంటే ప్రభుత్వం ఉంది.. ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి” సత్యవేడు అక్టోబర్ 7 గరుడధాత్రి : శ్రీ సిటీ పరిధిలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందడంతో విషాదంలో మునిగిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులతో నేరుగా సమావేశమైన కలెక్టర్.. వారి సాధకబాధకాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. “మీ వెన్నంటే ప్రభుత్వం ఉంది. మీకు ఏ...