GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 1:28 pm Posted by : GARUDA DHATRI NEWS

బాధిత కుటుంబాలకు శ్రీరామరక్ష సీఎం రిలీఫ్ ఫండ్ – ఎమ్మెల్యే ఆదిమూలం

బాధిత కుటుంబాలకు శ్రీరామరక్ష సీఎం రిలీఫ్ ఫండ్

✍️ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీలో ఎమ్మెల్యే ఆదిమూలం

✍️ పిచ్చాటూరులో నలుగురు బాధితులకు రూ.4.92 లక్షలు పంపిణీ

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ శ్రీరామ రక్షగా నిలుస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.
బుధవారం పిచ్చాటూరు టీడీపీ కార్యాలయంలో నలుగురు బాధితులకు రూ.4.92 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల హఠాత్తుగా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం విధిలేని పరిస్థితుల్లో చికిత్సకు వేలల్లో.. లక్షలలో.. స్థాయికి మించి ఖర్చు చేసి ఇబ్బంది పడుతుంటాతన్నారు.
అలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆపన్న హస్తంలా చేయూతనిస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాదితుల వివరాలు..
నాగలాపురం మండలం కృష్ణాపురం కు చెందిన బి
డిల్లీ బాబు కు రూ.1,90,756లు, వరదయ్యపాలెం మండలం కంబాక్కం కు చెందిన డి
చందు కు రూ.1,10,116లు, నారాయణవనం కు చెందిన ఏ.వెంకటేష్ కు రూ.96,534లు, అలాగే బి. ఎన్ కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు కు చెందిన ఇ.రాధాకృష ఆచారి కి రూ.95,103లు చెక్కులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.
వీరందరూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తనను ఆశ్రయించిన వెంటనే తన ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వివరించారు.
తాను కోరిన వెంటనే బాధితులకు సాయం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసు రెడ్డి, పద్దు రాజు, రవి రెడ్డి, డిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.