బాలలపై లైంగిక నేరాల నివారణకు అవగాహన కార్యక్రమం

పిచ్చాటూరు, జూన్ 18 గరుడధాత్రి : బాలలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టడం, బాలల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వెంగళతూరు ఎం.పీ.పీ. పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు సుమతి, బజావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో (POCSO) చట్టం-2012 గురించి వివరించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అశ్లీల కార్యకలాపాలకు పిల్లలను వినియోగించడం వంటి నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని...