బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత
పలమనేరు, జులై 27 ( గరుడ ధాత్రి ) : విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సమాజంలో బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పలమనేరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత పిలుపునిచ్చారు.గంగవరం మండలంలోని సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ మరియు కృష్ణారెడ్డి సాయి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ నందు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి లిఖిత గారు మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిరోధక చట్టం, ర్యాగింగ్ చట్టాలు,...