బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత

పలమనేరు, సెప్టెంబర్ 23 ( గరుడ ధాత్రి ) : సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పలమనేరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత పిలుపునిచ్చారు. గంగవరం మండల పరిధిలోని కీలపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ (K.G.B.V) కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చట్టం (యాంటీ ర్యాగింగ్ యాక్ట్), మహిళల అక్రమ రవాణా...