‘బాస్’ నాయకుడు దైవప్రసాద్‌ను పరామర్శించిన సంఘం నాయకులు
పలమనేరు, జూన్ 24 (గరుడ ధాత్రి ) : పలమనేరు బలిజ అభ్యుదయ సేవ సంఘం (బాస్) నాయకుడు దైవప్రసాద్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, ‘బాస్’ సంఘం నాయకులు బుధవారం ఆయనను పరామర్శించారు. పలమనేరులోని ఆయన స్వగృహానికి వెళ్లిన నాయకులు, దైవప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘బాస్’ సంఘం గౌరవ అధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు రూపేష్‌లతో పాటు పీజేసీ బాబు, ఆకుల గజేంద్ర, అరుణ్ కుమార్, సుదర్శన్ బాలాజీ,...