GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:29 pm Posted by : GURU SWAMY

బాస్ ప్రధాన కార్యదర్శిగా జనార్దన్, సహాయ కార్యదర్శిగా సుదర్శన్ బాలాజీ ఏకగ్రీవం

పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు బలిజ అభ్యుదయ సేవ సంఘం (బాస్) నూతన ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా క్రిష్ణమ్మగారి జనార్దన్, సహాయ కార్యదర్శిగా మర్రి సుదర్శన్ బాలాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం బలోపేతానికి, సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘బాస్’ గౌరవ అధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు రూపేష్‌లతో పాటు ముఖ్య నాయకులు పీజేసీ బాబు, ఆకుల గజేంద్ర, అరుణ్ కుమార్, కోటేశ్వర్లు, కిరణ్, చెంచు రెడ్డి, శ్రీధర్, డిష్ రమేష్, లక్ష్మీపతి, గణేష్, చిట్టి, గోవర్ధన్, జయశంకర్, అమ్ములు, రమేష్, నరేష్, రవి, మునిరాజులు, నరసింహులు, వెంకటరమణ, శంకరన్న, జనా, చంద్ర, సుబ్బు, జగ్గా, కిషోర్, సతీష్, లోకేష్, శబరి తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.