బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష

చౌడేపల్లి ఆగస్టు 03 గరుడ దాత్రి న్యూస్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'తల్లిపాల వారోత్సవాలు' చౌడేపల్లి, పుదిపట్ల గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సులోచన, రాధమ్మలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన అరగంట లోపు తల్లీబిడ్డలకు స్పర్శను కల్పిస్తూ తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువు పాలిట అమృతంతో సమానమని, అవి బిడ్డకు తొలి...