బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం: సిడిపిఓ శోభారాణి

కార్వేటినగరం ఆగస్టు 7 (గరుడ ధాత్రి): బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం సిడిపిఓ శోభారాణి అన్నారు. సిడి కండిగ సచివాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. బిడ్డ పుట్టిన అరగంట లోపు తల్లీబిడ్డలకు స్పర్శను కల్పిస్తూ తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువు పాలిట అమృతంతో సమానమని, అవి బిడ్డకు తొలి టీకాగా పనిచేసి జీవితాంతం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు. పుట్టినప్పటి...