బి.కొత్తకోట పీపుల్ ట్రీ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

చిన్నారుల కృష్ణలీలలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు బి.కొత్తకోట,సెప్టెంబర్ 3:(గరుడ ధాత్రి న్యూస్) బి.కొత్తకోట పట్టణంలోని పీపుల్ ట్రీ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు.చిన్నారుల కృష్ణ,గోపికల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన కృష్ణలీలలు,నృత్యాలు, భజనలు,సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అలరించాయి.శ్రీకృష్ణుడి బాల్య జీవితానికి సంబంధించిన విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ధర్మాన్ని కాపాడటం,సత్యాన్ని పాటించడం,మంచిని ఆచరించడం వంటి శ్రీకృష్ణుడి...