బీజేపీ జిల్లా ప్రశిక్షణ మహా అభియాన్ ప్రారంభం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సమీపంలోని వన్‌నెస్ క్యాంపస్-2లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ మహా అభియాన్ -2026 ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, భారతీయ జనతా...