GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:06 pm Digital Edition : GURU SWAMY

బీసీ రిజర్వేషన్ ను అడ్డుకునేందుకు జగన్ కుట్రలు

* బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పై కట్టిబడి ఉన్న తెలుగుదేశం పార్టీ.
* మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 ( గరుడ ధాత్రి న్యూస్): బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ శాసనమండలి సభ్యులు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు పేర్కొన్నారు . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైసీపీ అధికారంలోకి రాకముందు 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 24 శాతం కుదించి 16,800 మందిని రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరం చేశారన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు. ఇంప్లీడ్ చేసే అవకాశం ఉన్న కూడా జగన్ ముందు అడుగువేయలేదన్నారు.నాడు రాజ్యసభలో వైసీపీ ఓట్లపై కేంద్ర ప్రభుత్వం అధారపడినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై జగన్ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. రూ.75,740 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం దారి మళ్ళించిందన్నారు. ఆదరణతో పాటు మరో 30 బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. వైసిపి పాలనలో కబ్జాకు గురైన భూముల్లో అత్యధికంగా బీసీలకు చెందిన భూములే అన్నారు. అన్యాయాల్ని ప్రశ్నించిన బీసీ నేతల్ని 300 మంది జగన్ పాలనలో హత్య చేయబడ్డారని ఆరోపించారు. కడప జిల్లాలో ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదన్నారు.బీసీ బాంధవుడు చంద్రన్న: బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు 20 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన బీసీల బాంధవుడు అన్న ఎన్టీఆర్ అన్నారు.బీసీలకు ఉన్న 20 శాతం రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి, బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో 1977లో మొట్టమొదటి చైర్మన్ గీతానాథ్ అనే బీసీని గెలిపించారన్నారు. సీఎం చంద్రబాబు 4.20 లక్షల మందికి ‘ఆదరణ’ పరికరాలు అందజేశారన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.3,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. 13 బీసీ భవనాలు, 1,187 కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణాలు చేశారన్నారు.16 యూనివర్సిటీల్లో 9 మంది బీసీలను వీసీలుగా నియమించారు. రాజధాని అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావుపూలే స్మృతివనం నిర్మాణానికి ప్రణాళిక రచించారు. చంద్రన్న సారథ్యంలో త్వరలోనే బీసీ రక్షణ చట్టం అమలు. బీసీ జనగణన, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. 2014-19లో బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా రూ.40,000 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కింద 2014-19లో 2,234 మందికి రూ.244 కోట్లు ఖర్చు చేశాం. బీసీల నిధుల వినియోగాన్ని చట్టబద్ధం చేస్తూ గెజెట్లో ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.కూటమి పాలనలో బీసీ సంక్షేమానికి పెద్దపీట:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీల కోసం వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా రూ.32,534 కోట్లు ఖర్చు చేశాం. వడ్డెర్లకు 10 శాతం మైనింగ్ లీజులు, కల్లుగీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ దుకాణాలు కేటాయించాం. నేతన్న సేవలో పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం అందిస్తున్నాం. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తున్నాం. సబ్సిడీపై బోట్లు, డీజిల్ అందిస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 217ను రద్దు చేసి, వేటపై ఆంక్షలను ఎత్తివేశాం. నాయీ బ్రాహ్మణుల భృతిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాం. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలు, ఫీజు సహాయం వంటి పథకాలను కొనసాగిస్తున్నాం.బీసీలకు కేవలం సంక్షేమం మాత్రమే కాదు. రాజకీయంగా కూడా సాధికారత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బీసీలకు హక్కులు, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా.. అభివృద్ధిలో భాగస్వాములుగా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.బీసీలను మరోసారి మోసం చేయడానికి వైసీపీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీసీల రాజకీయ సాధికారత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది.బీసీ రిజర్వేషన్పై తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది:ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నెం.105, 1065 జారీ చేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీలకు న్యాయం చేసేందుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కృషి చేస్తుంది. ఎన్నికలు జరగకూడదు, బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు.బీసీలకు 34 శాతం కోటా విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మా సంకల్పం మారదు. బీసీలకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తాం. 34 శాతం రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.