ప్రమాదాలు జోరు-పఠించుకొని అధికారులు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు6
బెంగళూరు– చెన్నై ఎక్స ప్రెస్ హైవే బైరెడ్డిపల్లి సెక్షన్ ప్రారంభం కావడం తో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తక్కువ వ్యవధిలో బెంగళూర్ పట్టణం నుండి గమ్యం చేరుకోవచ్చని సంబరపడ్డారు.కానీ ఈ రహదారి లోబైరెడ్డిపల్లి తరువాత పనులు పూర్తికాకపోవడం తో చిత్తూరు ,తిరుపతికి పోవు వాహనాలు బైరెడ్డిపల్లి సెక్షన్ రహదారి పై తక్కువ సమయం లో చిత్తూరు,తిరుపతి కి వెళ్లాలని వాహనాలు పరుగులు తీస్తున్నవి. దీనికి తోడు గూగుల్ మ్యాప్ ఈ రహదారి తక్కువ సమయంలో గమ్యం చేరవచ్చు అని చూపడంతో కర్ణాటక,,తమిళనాడు వాహనాలు ఈ రహదారిలో పరుగులు తీస్తూ బైరెడ్డిపల్లి ట్రాఫిక్ బెంగళూరు ట్రాఫిక్ తో పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో ప్రతి రోజు ప్రమాదాలు కొనసాగుతూ మండల ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. బైరెడ్డిపల్లి లో రహదారి ఇరుగ్గా ఉన్నందున రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి రహదారికి ఇరువైపులా ప్రభుత్వ స్థలం ఆక్రమణలను తొలగించి పనులు చేపట్టాలని సుమారు 10 నెలలు అవుతున్న అధికారులు ప్రయత్నాలు చేపట్టక ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు. బైరెడ్డిపల్లి కి బైపాస్ రహదారి మంజూరు అయిన పురిటిదశల్లో కొనసాగుతుడడం ప్రజను ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా బైరెడ్డిపల్లి ట్రాఫిక్ సమస్యలకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వం ను కోరుతున్నారు.