GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:42 am Digital Edition : GURU SWAMY

బేలుపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కోసం వాటర్ క్యాన్లు బహుకరణ చేపట్టిన దాత

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్21

బైరెడ్డిపల్లి మండలం లోని బేలుపల్లి ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలకు సోమవారం ఒక దాత వాటర్ క్యాన్లు బహుకరించారు.
బైరెడ్డిపల్లి కి చెందిన శేషాద్రిస్వామి ఆలయ సేవకులు ధనంజయ గౌడు 25 లీటర్ ల కెపాసిటీ గల 10వాటర్ క్యాన్లు ను పాఠశాలల హెచ్.ఎం.,ఉపాధ్యాయులకు అందజేశారు. దాతను పాఠశాల హెచ్.ఎం.అభినంధించి కృతజ్ఞతలు తెలియజేశారు. దాత మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇటివలన వాటర్ క్యాన్లు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు.