చిత్తూరు అక్టోబర్ 4 (గరుడ గాత్రిన్యూస్)చిత్తూరునగరంలో జరుగుతున్న రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు తో కలిసి పరిశీలించారు. ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలు ఇరువురు ఓకే బైకుపై ప్రయాణిస్తూ పలమనేరు రోడ్డులో జరుగుతున్న విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల పనుల పురోగతిని.. దర్గా సర్కిల్ నుండి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. రోడ్డు విస్తరణ, ఇరువైపులా కాలువల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. న్యూట్రిన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న అమ్మవారి ఆలయాన్ని స్థానికుల వినతి మేరకు మరోచోట నిర్మిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ.. నగరంలో రోడ్లు విస్తరణకు ప్రజల అద్భుతంగాసహకరిస్తున్నారని, రోడ్డు విస్తరణ కోసం స్థలాలనుంచి సహకరిస్తున్న వారిని తగిన విధంగా గౌరవిస్తామన్నారు. చిత్తూరు నాలుగు వైపులా రహదారులను అభివృద్ధి పరిచి ఒక అందమైన నగరంగాతీర్చిదిద్దుతామన్నారు. చిత్తూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే గాంధీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని, పలమనేరు రోడ్డు, కొంగారెడ్డిపల్లి, సాంబయ్యకండిగ – కట్టమంచి బైపాస్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు సర్వే గంగా జరుగుతున్నాయన్నారు. కట్టమంచి నుంచి ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడానికి రూ.37 కోట్లు నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో తెదేపా నగర అధ్యక్షుడు వరుణ్ కుమార్, నాయకులు రాజేష్ కుమార్ రెడ్డి, కాజూరు బాలాజీ, ఎంఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ నాగేంద్ర, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.