సంతానోత్పత్తి, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య సేవలు
బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 27 గరుడధాత్రి:
బైరెడ్డిపల్లిలో అక్టోబర్ 2న ఉచిత సంతానోత్పత్తి, మహిళల ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పీఈఎస్ హాస్పిటల్, కుప్పం ప్రతినిధి, పీఆర్వో చంద్ర తెలిపారు.
పిల్లలు లేని దంపతులకు అవసరమైన వైద్య సలహాలు, సంతానోత్పత్తికి సంబంధించిన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై కూడా వైద్యుల ద్వారా పరీక్షలు, సలహాలు అందించనున్నట్లు తెలిపారు.
స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో అక్టోబర్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని చంద్ర తెలిపారు.
బైరెడ్డిపల్లి పరిధిలోని పిల్లలు లేని దంపతులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంబంధిత కుటుంబాలకు శిబిరం సమాచారం తెలియజేసి, అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.