బైరెడ్డిపల్లిలో నేడు 82 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు
బైరెడ్డిపల్లి, గరుడధాత్రి, సెప్టెంబర్ 28: బైరెడ్డిపల్లి మండలంలోని 82 పాఠశాలల్లో నేడు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు జనార్దన్‌రెడ్డి, దేశమ్మ తెలిపారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, గురుకుల పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్‌లలోనూ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, ఎస్‌ఐతో పాటు మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్తి...