బైరెడ్డిపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుంతలో ఇరుక్కున్న లారీ

భారీగా ట్రాఫిక్ జామ్‌.. వాహనదారుల అవస్థలు! రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమా? బైరెడ్డిపల్లి, అక్టోబర్ 25 గరుడదాత్రి : బైరెడ్డిపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రహదారిపై ఉన్న గుంతలో లారీ ఇరుక్కుపోవడంతో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరగా, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీలంపల్లి దాటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో బైరెడ్డిపల్లి సెక్షన్ అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రాంతంలో...