బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి దక్కిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2 బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగ్గా వున్నదని స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్ లభించింది. శుక్రవారం చిత్తూరు లో గాంధీ జయంతి ఉత్సవాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ,ప్రజాప్రతినిధులు నుండి ఈ అవార్డు ను వైద్యాధికారి విజయచందర్ అందుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బైరెడ్డిపల్లి పి.హెచ్.సి పై ప్రశంసల వర్షం కురిపించారు. బైరెడ్డిపల్లి ప్రజలు,ఆరోగ్యసిబ్బంది, రాజకీయనాయకులు ఈ అవార్డ్ దక్కడం పై హర్షం వ్యక్తం చేస్తూ వైద్య అధికారిని, సిబ్బందిని అభినంచి శుభాకాంక్షలు తెలియజేశారు.