GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 8:53 pm Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు

16 స్థానాలకు 37 మంది అభ్యర్థులు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ..!

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 27 గరుడదాత్రి:

బైరెడ్డిపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.

మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, జనసేన పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు చొప్పున పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటూ, ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు.

-82 నామినేషన్లు చెల్లుబాటు.. 45 మంది ఉపసంహరణ

నామినేషన్ల పరిశీలన అనంతరం 82 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు. ఉపసంహరణల గడువు ముగిసే సమయానికి 45 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రకటించినట్లు వెల్లడించారు.

ఎంపీటీసీ స్థానాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు

ఆలపల్లి: టీడీపీ – ఎల్. సుమిత్రమ్మ; వైఎస్సార్‌సీపీ – వనజ ఎం. @ ఎం. వనజాక్షి.

బైరెడ్డిపల్లి–1: టీడీపీ – బి. అరుణ్ కుమార్; వైఎస్సార్‌సీపీ – సతీష్ ఎం.జె.

బైరెడ్డిపల్లి–2: టీడీపీ – బి. రాధ; వైఎస్సార్‌సీపీ – ఎం.ఎస్. రాధ; స్వతంత్ర అభ్యర్థి – ఐరాల కృష్ణవేణి.

బేలుపల్లి: టీడీపీ – కె. వెంకటరమణ; వైఎస్సార్‌సీపీ – ఎం. శ్రీనివాసులు.

చప్పిడిపల్లి: టీడీపీ – వి. తిప్పారెడ్డి; వైఎస్సార్‌సీపీ – ఎం. మాధవరెడ్డి; కాంగ్రెస్ – జి. రాధాకృష్ణ.

దేవదొడ్డి: వైఎస్సార్‌సీపీ – ఎం. ప్రభావతి; జనసేన – ఎం. స్వప్న.

ధర్మపురి: టీడీపీ – ఎన్. లక్ష్మమ్మ; వైఎస్సార్‌సీపీ – ఎం. శోభ.

గొల్లచీమనపల్లి: టీడీపీ – బి. శ్రావణి; వైఎస్సార్‌సీపీ – సరస్వతి టి.

కడపనత్తం: టీడీపీ – జి. బాలచంద్ర; వైఎస్సార్‌సీపీ – ఆర్. మైఖేల్.

కమ్మనపల్లి: టీడీపీ – కె. దామోదర రెడ్డి; వైఎస్సార్‌సీపీ – నాగిరెడ్డి @ బి. నాగిరెడ్డి; కాంగ్రెస్ – ఆర్. మనోహర్.

లక్కనపల్లి: టీడీపీ – అమర్నాథ్ గౌడు కె.; వైఎస్సార్‌సీపీ – జి. రాజేంద్ర.

ఎం. కొత్తూరు: టీడీపీ – ఎన్. గీత; వైఎస్సార్‌సీపీ – జి. వసంతమ్మ.

నెల్లిపట్ల: టీడీపీ – జె. విల్వనాథ్; వైఎస్సార్‌సీపీ – పి. అమరనారాయణ స్వామి; కాంగ్రెస్ – వి. వెంకటేష్.

పాతపేట: టీడీపీ – వి. పుష్పమ్మ; వైఎస్సార్‌సీపీ – రోజా వి.; కాంగ్రెస్ – ఎం. ఉమ.

తీర్థం: టీడీపీ – జి. ప్రమీల; వైఎస్సార్‌సీపీ – మొగసాల పుష్పమ్మ @ ఎం.కె. పుష్ప.

వెంగంవారిపల్లి: టీడీపీ – జి.ఎస్. రమ్య; వైఎస్సార్‌సీపీ – బి. కాంతమ్మ.

-నవంబర్ 3న పోలింగ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ తమ స్థానాల్లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో బైరెడ్డిపల్లి మండలంలో ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.