బైరెడ్డిపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు

16 స్థానాలకు 37 మంది అభ్యర్థులు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ..! బైరెడ్డిపల్లి, అక్టోబర్ 27 గరుడదాత్రి: బైరెడ్డిపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది,...