బైరెడ్డిపల్లి మండలంలో 4వ రోజు కూడా ఒంటరి ఏనుగు బీభత్సం…. పలుచోట్ల రైతున్నలకు నష్టం

గౌనితిమ్మేపల్లి గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులు ద్విచక్ర వాహనాన్ని తొక్కి నుజ్జుచేసిన ఒంటరి ఏనుగు బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4 బైరెడ్డిపల్లి మండలంలో వరుసగా 4వ రోజు కూడా ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టించడం జరిగింది. వేకువ జామున అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో ఎర్రచేను వద్ద ఒంటరి ఏనుగు ఒక లేగ దూడ, ఒక ఆవు, రాతి బండలను పెకల్చి నష్టం చేకూర్చినది. ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం సహాయం చేయాలని బాధిత రైతన్నలు కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల శిథిలమైన కందకాల వద్ద...