GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 4:50 pm Posted by : GURU SWAMY

బైరెడ్డిపల్లి మండలం వైష్ణవాలయంలలో అభిషేకం,ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్20

బైరెడ్డిపల్లి మండలం లోని వైష్ణవాలయంలలో శనివారం అభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని మురారిపల్లిలో శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు తిప్పచార్యులచే పంచామృత అభిషేకం చేపట్టారు.అనంతరం శ్రీదేవి,భూదేవి సమేత
శ్రీ ఓబులేశ్వరస్వామి ని విశేష అలంకారంలో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలం లోని కడపనత్తం గ్రామంలోని శ్రీ నల్గొండరాయస్వామి ఆలయంలో అర్చకులు రామకృష్ణమాచార్యులు చే అభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు ఉభయదార్లు పాల్గొన్నారు.