GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 10:33 pm Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి లో అక్టోబర్2న ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్27

బైరెడ్డిపల్లి లో అక్టోబర్2న శుక్రవారం ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం పి.ఈ.ఎస్ హాస్పిటల్, కుప్పంవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పి ఆర్ ఓ.చంద్ర పేర్కొన్నారు . పిల్లలు లేని దంపతులకు సంతానోత్పత్తి వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం చేపడుతున్నమని ఆయన తెలిపారు.ఈ శిభిరం శుక్రవారం స్థానిక జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
కావున మీ పరిధిలోని పిల్లలు లేని దంపతులకు ఈ ఉచిత వైద్య శిబిరం గురించి తెలియజేసి, మీ సహకారంతో వారు అధిక సంఖ్యలో శిబిరానికి హాజరు అయి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించగలరు అని ఆయన కోరారు.