GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 8:11 pm Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి లో ఉచితకంటి చికిత్స వైద్య శిభిరంకు చక్కటి స్పందన

30 మందికి వైద్యపరీక్షలు,14 మంది ఆపరేషన్లకు ఎంపిక

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు9
బైరెడ్డిపల్లి జడ్ పి హైస్కూల్ నందు చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించగా చక్కటి స్పందన లభించింది.
ఈ చికిత్సా శిభిరం నకు మండలం లోని ప్రజలు 30మందికి వైద్యపరీక్షలు చేపట్టగా కంటి శస్ర్త చికిత్స నకు 14మంది ఎంపికయినారు అని నిర్వాహకులు తెలిపారు. ఇంతకు మునుపు కంటిశస్త్ర చికిత్స చేసుకొన్నవారికి కంటి అద్దాలుఅందించినారు. కంటి శస్త్ర చికిత్సలకు ఎంపికయిన వారికి ప్రఖ్యాతి గాంచిన చెన్నె శంకర నేత్రాలయ హాస్పిటల్ నందుఉచిత కంటి శస్త్త చికిత్సలు చేయడం జరుగుతుంది అనిపేర్కొన్నారు .ఆపరేషన్లకు ఎంపిక అయినవారికీ ఉచిత ప్రయాణం ,బోజనం,వసతి,మందులు అందజేయడం జరుగుతుంది అన్నారు.శస్ర్ర చికిత్స లకు ఎంపికైన వారికి వారి సహాయకులకు ఈ రోజు మధ్యాహ్న భోజనం ,తాగునీరు స్థానిక శ్రీనివాస హోటల్ దిలీప్ కుటింభికులు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం లో శంకర నేత్రాలయడా,మురళి క్రిష్ణ,డా,శ్రీనివాసులు,డా.రమణ,డా,గంగాధరం చంద్ర,చిన్నప్ప ,
జయరామి రెడ్డి , తదితరులు పాల్గొన్నారు