-55 మందికి పరీక్షలు 30మంది ఆపరేషన్లకు ఎంపిక
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్14
బైరెడ్డిపల్లి జడ్ పి హైస్కూల్ నందు ఆదివారం చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంకు ప్రజల నుండి చక్కటి స్పందన లభించింది.ఈ చికిత్సా శిభిరం నకు మండలం లోని ప్రజలు 55మంది కి పరీక్షలు చేపట్టగా 30 మంది ఆపరేషన్లకు ఎంపిక ఆయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.గతనెల శస్త్ర చికిత్స చేసుకొన్నవారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ రోజు కంటి శస్త్ర చికిత్సలకు ఎంపికయిన వారికి ప్రఖ్యాతి గాంచిన చెన్నె శంకర నేత్రాలయ హాస్పిటల్ నందుఉచిత కంటి శస్త్త చికిత్సలు చేయడం జరుగుతుంది.వీరందరికి ఉచిత ప్రయాణం ,బోజనం,వసతి,మందులు అందజేయడం జరుగుతుంది. శస్ర్ర చికిత్స లకు ఎంపికైన వారికి వారి సహాయకులకు ఈ రోజు మధ్యాహ్న భోజనం ,తాగునీరు ధాతలు స్తానిక శ్రీనివాస హోటల్ దిలీప్ కుటిఎంబీకులు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం లో శంకర నేత్రాలయడా,మురళి క్రిష్ణ,డా,శ్రీనివాసులు,డా.రమణ,డా,గంగాధరం చంద్ర,చిన్నప్ప ,జయరామి రెడ్డి , తదితరులు పాల్గొన్నారు