బైరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

బైరెడ్డిపల్లి,అక్టోబర్ 21 గరుడదాత్రి: బైరెడ్డిపల్లిలోని మొరవంక మలుపు వద్ద మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బేలుపల్లికి చెందిన మునిరత్నం కుమారుడు అనిల్ కుమార్ (35) ద్విచక్ర వాహనంపై మండలంలోని గంగారుపూర్‌కు వెళ్తుండగా, పలమనేరు నుంచి బైరెడ్డిపల్లి వైపు వస్తున్న నౌషాద్ కుమారుడు డానిష్ (19) ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనం మొరవంక మలుపు వద్ద ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అనిల్...