తమ గ్రామoలోనే 3,4,5 తరగతులు కొనసాగించాలి అంటూ రోడ్డు పై ధర్నా చేపట్టిన మురారిపల్లి గ్రామస్థులు.
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్22
బైరెడ్డిపల్లి మండలంలోని మురారిపల్లి ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను మరో పాఠశాలకు భదలీ చేసారు.ఈ నేపధ్యంలో పలుసార్లు అధికారులు కు మా గ్రామoలోనే 3,4,5 తరగతులు కొనసాగించాలి అంటూ మొరపెట్టుకొంటున్నారు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నేటికి అధికారులు స్పందించక పోవటంతో సోమవారం మండల కేంద్రం లోని చెక్ పోస్ట్ నాలుగు కూడళ్లు వద్ద జాతీయ రహదారిపై మురారిపల్లి గ్రామస్థులు ధర్నా చేపట్టారు.ఎమ్మెల్యే, కలెక్టర్ రావాలి అంటూ ప్లేకార్డులతో నినాదాలు చేశారు. దీనితో ట్రాఫిక్ సమస్యఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. మండుటెండలో చిన్నారులు తల్లిదండ్రులు తో కలసి ధర్నా చేయడం తో ఈ సంఘటన మండలం లో ప్రముఖ చర్చనీయాంశం అయినది.జాతీయ రహదారిపై ధర్నా చేయడం కరెక్ట్ కాదు….మీరు కార్యాలయం వద్ద సమస్య చెప్పుకోండి…. ఎస్ ఐ చందన ప్రియ సంఘటన స్థలంలోని గ్రామస్థులకు హితబోధ చేశారు.సమస్య చెప్పండి…. మేము మా వంతు సహకరిస్తాంఅని ఎస్ ఐ పేర్కొనడంతో ఆందోళన కారులు
ఎం ఆర్ సి కార్యాలయం బాట పట్టినారు. ఇలాంటి సమస్యలు ను అధికారులు త్వరగా పరిష్కారం చేపట్టి భవిభారత పౌరుల భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఉంది.