GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 1:34 pm Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి లో వేడెక్కుతున్న రాజకీయాలు

పార్టీల సభలకు పోటాపోటీగా తరులుతున్న పార్టీల శ్రేణులు.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్12

బైరెడ్డిపల్లి లో స్థానిక ఎన్నికలు సమీపించే సందర్భంగా తమ పార్టీలు ఏర్పాటుచేస్తున్న సభలకు పోటాపోటీగా పార్టీల శ్రేణులు తరులుతున్న సంఘటనలు బైరెడ్డిపల్లి లో శుక్రవారం చోటుచేసుకున్నది. తిరుపతి సమీపం లోని దామినేడు లో కూటమి పార్టీలు 2సవత్సరాలు సంక్షేమం –అభివృద్ధి పై విజయోత్సవ బహిరంగ సభ శుక్రవారం ఏర్పాటుచేయడం,ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,బి.జే.పి.రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలో బైరెడ్డిపల్లి మండల టి.డి.పి.శ్రేణులు ఉత్సాహం గా దామినేడు విజయోత్సవ బహిరంగ సభ కు మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు,కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలోపసుపు శ్రేణులు తరలి వెళ్లారు.ఇదే సమయంలోపలమనేరు లో నియోజకవర్గ వైకాపా చంద్రబాబు వెన్నుపోటు కు రెండేళ్లు నిరసన సభ శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ సభకు మొగసాల సోదరులు కృష్ణమూర్తి, రెడెప్ప ఆధ్వర్యంలో పోటాపోటీగా వైపా శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సంఘటన మండల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు ప్రధాన పార్టీలు ఫ్యూహాలు రసవత్తరంగా నెలకొనడంతో మండలంలో రాజకేయ వేడి ప్రారంభంకు నోచుకొన్నట్లు అయినది.