బైరెడ్డిపల్లెలో జానకమ్మ స్మారక అవార్డులుతో అంతర్రాష్ట్ర కళాకారులకు ఘనసత్కారం
బైరెడ్డిపల్లె గరుడదాత్రి ఆగస్టు9 బైరెడ్డిపల్లె మండలంలోని శ్రీ ముని నారాయణ డిగ్రీ కళాశాలలో జానకమ్మ స్మారక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమాజ సేవతో పాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఈసందర్భంగా సన్మానించారు. సమాజ సేవలో విశేష సేవలందించిన పగడాల మధుసూధన్‌రావుకు జానకమ్మ స్మారక పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. సమాజ సేవ, కళా రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి విచ్చేసిన కళాకారులను కూడా...