బోయకొండ భవానీ నగర్‌లో పేకాట శిబిరంపై దాడి: 24 మంది అరెస్ట్, ₹5 లక్షల నగదు స్వాధీనం
చౌడేపల్లి: ఆగస్టు 23 గరుడ దాత్రి న్యూస్ అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పరిధిలోని బోయకొండ భవానీ నగర్‌లో బహిరంగంగా నిర్వహిస్తున్న భారీ పేకాట శిబిరంపై రూరల్ సర్కిల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 24 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు చౌడేపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సాయి ప్రసాద్ తెలిపారు. దాడి వివరాలు: బోయకొండ భవానీ నగర్‌లోని డిష్ సూరి రూముల వెనుక భాగంలో వీధి లైటు వెలుగులో పేకాటాడుతున్నారనే విశ్వసనీయ...