బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నా మెసెంజర్, గార్డ్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి
దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ వి వి ప్రసాద్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 26 27 తేదీలలో చేపట్టనున్న సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం తిరుపతిలో ఎస్బిఐ ఉద్యోగులు పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న బ్యాంకు వద్ద ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు....