GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 8:23 am Posted by : GARUDA DHATRI NEWS

బ్యాంక్ అధికారుల తీరుపై రైతుల ఆవేదన

-వడ్డీతోపాటు అసలు చెల్లించాల్సిందే..

-రెన్యువల్స్ కు అవకాశం లేదు..

సత్యవేడు స్టేట్ బ్యాంక్ అధికారులు తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు పంటల సాగు కోసం బంగారం పెట్టి రుణాలు పొందిన రైతులు నేడు బ్యాంక్ అధికారుల కొత్త నిబంధనలతో నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది అసలు వడ్డీ పూర్తిగా చెల్లిస్తే… మళ్లీ కొత్తగా రుణం పొందవచ్చును… రెన్యువల్స్ కి అవకాశం లేదు… మాకు వచ్చింది కొత్తగా ఆర్బిఐ నుంచి నిబంధనలు అంటూ బ్యాంక్ అధికారులు తేల్చి చెబుతున్నారు ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టేట్ బ్యాంక్ అధికారులు గోల్డ్ లోన్లు పొందితే… రెన్యువల్స్ కి అవకాశం ఇస్తున్నారు సత్యవేడులో మాత్రం ఆ పరిస్థితి లేదని సిబ్బంది గట్టిగా చెప్పేస్తుండడంతో లబ్ధిదారుల పరిస్థితి
దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులకు గురవుతున్నారు గోల్డ్ లోన్ పెట్టినప్పుడు… రెన్యువల్స్ కు అవకాశం లేదని బ్యాంక్ అధికారులు చెప్పలేదని, రెన్యువల్స్ కోసం వెళ్తే.. అసలు వడ్డీ చెల్లించి మీరు బంగారం పొందాల్సిందే… మా దగ్గర కొత్త నిబంధనలు వచ్చాయి మేమేమి చేయలేం అంటూ అక్కడ సిబ్బంది చెప్పడం చాలా బాధించే అంశంగా ఉందని రైతులు వాపోతున్నారు గడువు పూర్తయితే… మీ బంగారం ను వేలం వేస్తాం… మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్లండి… అసలు వడ్డీ వస్తే… తాకట్టు పెట్టిన బంగారం ఇస్తాం అంటూ మరో ఉచిత సలహా కూడా ఇక్కడ వారు ఇస్తున్నారు సిబ్బంది మరో అడుగు ముందుకు వేసి…. ఏమిటండీ ఎన్నిసార్లు చెప్పాలి మీకు… అసలు వడ్డీ చెల్లించి లోను క్లియర్ చేసుకోండి… రెన్యువల్స్ కి అవకాశం లేదు అని ఫోన్ లో రైతులకు గట్టిగా చెప్పేస్తున్నారు

-నోరు మెదపని కూటమి నేతలు…!!

మాది రైతు ప్రభుత్వం… రైతు సంక్షేమమే మా ధ్యేయం అంటూ ప్రకటన ఇచ్చే కూటమి నేతలు బ్యాంక్ అధికారుల తీరుపై పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ స్టేట్ బ్యాంకు లో లేని విధంగా… సత్యవేడు స్టేట్ బ్యాంక్ అధికారులు ఆర్.బి.ఐ నుంచి నిబంధనలు వచ్చాయి., అసలు వడ్డీ చెల్లిస్తేనే.,. మీ బంగారం విడిపించుకోండి అంటూ తేల్చి చెబుతున్న… ఈ వ్యవహారంపై ప్రశ్నించే దిక్కు లేదని రైతాంగం మండిపడుతోంది ఇక్కడ బ్యాంక్ అధికారులు పూర్తిగా తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి డబ్బులతో వెళ్లి …. ఇక్కడ డీడీలు పొందాలన్నా… సమస్య తప్పడం లేదు… అంతా ఆన్లైన్… నో క్యాష్… మీ ఖాతాలో డబ్బులు ఉంటే చూడండి… లేదంటే వెళ్లిపోండి అంటూ బ్యాంకుకు వచ్చే వారిని ఇంటి ముఖం పట్టిస్తున్నారు ఇక్కడ అధికారుల తీరుపై విసిగిపోయిన పలువురు ఇతర బ్యాంకు సేవలపై దృష్టి పెడుతున్నారు.