GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:30 pm Digital Edition : GURU SWAMY

భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ బొజ్జ గణపయ్యకు వీడ్కోలు

చౌడేపల్లి సెప్టెంబర్ 20 గరుడ దాత్రి న్యూస్

​చౌడేపల్లి మండల పరిధిలోని పలు ప్రాంతాలలో దేదీప్యమానంగా పూజలందుకున్న వినాయకుని విగ్రహాల నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మండల కేంద్రంలోని నేతాజీ నగర్, బజార్ వీధి, శ్రీ రామస్వామి ఆలయ సమీపంతో పాటు వివిధ వీధుల్లో భక్తులు ప్రతిష్టించిన గణనాథులను నిమజ్జనానికి ఘనంగా తరలించారు.
​ఉత్సవాల ముగింపు సందర్భంగా యువతీ యువకులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా రప్పించిన ‘బళ్లారి డ్రమ్స్’ వాయిద్యాల శబ్దాలకు, భక్తుల నృత్యాలకు వీధులన్నీ మారుమోగిపోయాయి. “జై గణేష్.. మోరియా”, “గణపతి బప్పా మోరియా.. మళ్లీ ఏటికి త్వరగా రా” అంటూ భక్తజనం నినాదాలు చేస్తూ శోభాయాత్రను కంటిపాపలా వీక్షించారు. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి వీడ్కోలు పలికారు.