భక్తి పారవశ్యంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం
గోవిందా... గోవిందా...’ నామస్మరణల మధ్య భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తజనం నారాయణవనంలో ఆధ్యాత్మిక వైభవం... దివ్య రథంపై కల్యాణ శ్రీనివాసుడు జూన్ 5న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, భజనలు, వేదఘోషల మధ్య స్వామివారి రథయాత్ర సాగింది. ఉదయం 7.45 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ...