భక్తి ప్రపత్తులతో శ్రీ గంగమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

పిచ్చాటూరు, సెప్టెంబర్ 13 గరుడధాత్రి : పిచ్చాటూరు గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో భక్తి ప్రపత్తులతో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన భూమిపూజ క్రతువును ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వేదోక్తంగా నిర్వహించారు. చిరకాలంగా గ్రామదేవతగా కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి తమ చేతుల మీదుగా భూమిపూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని మాజీ సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి, గ్రామ పెద్దలు...