భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే టీటీడీ లక్ష్యం

-రైస్ మిల్లర్లతో స‌మావేశంలో టీటీడీ అద‌న‌పు ఈవో -అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల ప్రశంసలు గరుడధాత్రి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌద‌రి తెలియ‌జేశారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఆయ‌న‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న...